Friday, June 1, 2012

కన్నుల కలవరం

నువ్వు నేను మనం అని భావించిన నా కన్నె మనసు ఎరుగదు
ఆ భ్రమ ఎంత భయంకరమైనదో 
నా కళ్ళు వర్షించే కన్నీటి అలలకు తెలియదు నా వన్నెల వెన్నెలలు 
ఆ ప్రవాహంలో కలిసిపోయాయని 
అమావాస్యనాడు వెన్నెలను తిలకించిన నా కన్నులకు కనపబడలేదు 
జీవితంలో అనుభవంలోకి రాబోయే ఈ చీకటి

దరి చేరవా...

నేను నిష్టూరమాడితినని అలకబూనిన నువ్వు ..........
మనం అల్లుకున్న కలల పోదిరింట్లో 
                             నీ కన్నె మనసు చేసిన బాసలు మరిచితివా ...........
మన ఇరువురి కళ్ళు కలిసిన క్షణాన,
                            ఉప్పొంగిన అలలా మారిన నీ మనఃస్పందన గురుతురాలేదా ................... 
వెన్నెల రేయిలో నీ వన్నెలతో నన్ను అలరించిన నీవేనా
                             నీ కన్నుల కాటిన్యంతో ఇలా అంధకారంలో నెట్టి శిక్షిస్తున్నావు  ......
నువ్వు లేని నేను శూన్యమని తెలిసే కరుణించవైతివా ....
                              చెలీ ..........  అలక మాని దరి చేరవా...
నీ మనోహరుని మానస వీణ పై అలరారుతున్న ప్రనయావేస తంత్రులను....
                               నీ క్రీగంటి చూపులతో ఒక్క సరి మీటి పోవ.......

Wednesday, May 30, 2012

నా ఆపేక్ష

ప్రతీక్షణం నీ సమక్షాన్ని కోరుకునే నేను,

పరోక్షంలోనైనా అనుక్షణం నీ తలపును కాలేనా?
తీక్షణమైన మనోక్షరంలో నీ సమాక్షరానికై నిరీక్షిస్తూ...
క్షరం కాని ఆపేక్షని అక్షరాలలో ప్రతిక్షిస్తున్నా ....

ప్రేమ మకరందానికై

    మొన్నలలో ప్రేమ ......సముద్రపు అలలపై నాట్యమాడే చందమామ ప్రతిబింబంగా ఊరించినా,

    నిన్నలలో ప్రేమ ...... మధురమైన తీయని కలగా మిగిలినా,
    నేటి చేదు అనుభవాలు ...ఆ కలలన్నీ  కల్లలని పరిహశించినా 
    అందాల బృందావనిలో ఆ ప్రేమ మకరందానికై 
    నా మనసు విహరిస్తూనే ఉంది ....నా ఆశ నానాటికి చివురిస్తూనే ఉంది